విజేత టీజర్ కు అద్భుతమైన స్పందన

By Press Note Jun. 14, 2018, 11:06 am IST
విజేత టీజర్ కు అద్భుతమైన స్పందన

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా టీజర్ నిన్న విడుదలై  ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ పొందింది. యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉండడమే కాకుండా 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. టీజర్ లో కళ్యాణ్ దేవ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా కనబరిచాడు.

విజేత టీజర్ చూస్తుంటే, ఈ చిత్రం తండ్రి, కొడుకుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను గుర్తు చేసే విధంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సబ్జెక్టు కనెక్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. "మనసుకు నచ్చిన పని చేసుకుంటూ బ్రతకడం అందరికి సాధ్యం కాదు. లైఫ్ లో కొంచెం కాంప్రమైజ్ అయ్యి బ్రతకాలి." మురళి శర్మ చెప్పిన ఈ డైలాగ్ అందరిని ఆలోచింపచేస్తోంది.

రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ  సినిమాలో  కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా జూన్ 24న భారీ స్థాయిలో  "విజేత" ఆడియో ఫంక్షన్ జే. ఆర్.సి కన్వెంక్షన్ లో జరగబోతోంది. సినీ పరిశ్రమ నుండి ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. బాహుబలి కెమెరామెన్ కె.కె.సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. జులై మొదటివారంలో విజేత సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

నటీనటులు:
కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా.

సాంకేతిక నిపుణులు:
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి.
నిర్మాత: రజిని కొర్రపాటి.
సాయి కొర్రపాటి ప్రొడక్షన్ 
ప్రెజెంటర్: సాయి శివాని
కెమెరామెన్: కె.కె.సెంథిల్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్.
సాహిత్యం: రెహమాన్, రామజోగయ్య శాస్త్రి.
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్.
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ.
స్టంట్స్: జాషువ.
పీ. ఆర్.ఓ: వంశీ - శేఖర్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp