అల్లుడు అదుర్స్ క‌రోనా కంటే డేంజ‌ర్‌!

By G.R Maharshi Feb. 13, 2021, 12:48 pm IST
అల్లుడు అదుర్స్ క‌రోనా కంటే డేంజ‌ర్‌!

విధి విచిత్ర‌మైంది. ఒక అర‌బ్ క‌థ వుంది. ఒకాయ‌న కైరో మార్కెట్లో వెళుతుండ‌గా మృత్యుదేవ‌త క‌నిపించి న‌వ్వింది. భ‌యంతో గుర్రం ఎక్కి ఎడారిలో పారిపోసాగాడు. కొంచెం దూరంగా వెళ్లాకా మృత్యువు ఎదురై "అస‌లు నీతో అపాయింట్‌మెంట్ వున్న‌దే ఎడారిలో. నువ్వు అక్క‌డ ఏం చేస్తున్నావా?" అని న‌వ్వాను అని ప్రాణం తీసింది. అల్లుడు అదుర్స్ థియేట‌ర్‌లో చూడ‌కుండా త‌ప్పించుకున్నాను. OTTలో చూడాల్సి వ‌చ్చింది. రాసి పెట్టిన‌పుడు చూడ‌క త‌ప్పుతుందా!

సృష్టి ఒక బ్ర‌హ్మ‌ప‌దార్థం. దాన్ని అర్థం చేసుకోడం క‌ష్టం అంటారు పండితులు. ఈ సినిమా కూడా అలాంటిదే. అస‌లు క‌థ ఏంటో, అది ఎటు పోతుందో అర్థం కాదు. ప్రారంభంలో ఏం చూస్తున్నామా అని, చివ‌ర్లో ఏం చూసామా అని సంశయం క‌లుగుతుంది. ఒక సీన్ అర్థ‌మ‌య్యేలోగా. అంత‌కు మించిన పీన్ వ‌చ్చి ప‌రీక్ష పెడుతుంది. మాథ్స్ టెక్స్‌బుక్ ముందెట్టుకుని హీరో తానే ప్రాబ్ల‌మ్ సృష్టించి తానే సాల్వ్ చేస్తుంటాడు. ప్ర‌కాష్‌రాజ్‌ని చూస్తే జాలేస్తుంది. ఒక సీన్‌లో ఇపుడు నేనేం చేయాలి అని అడుగుతాడు. క్యారెక్ట‌ర్ అర్థ‌మైతే క‌దా ఏమ‌న్నా చేయ‌డానికి.

సీరియ‌స్ సినిమా తీయాల‌నుకుంటే సీరియ‌స్‌గా తీయాలి. కామెడీ అనుకుంటే కామెడీ చేయాలి. రెంటిని క‌లిపి మిక్సీలో వేస్తే, ప్రేక్ష‌కులు వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కుని వుతికించుకుంటారు. శ్రీ‌ను వైట్ల ఫార్ములా ఒకప్పుడు న‌డిచింది. దానికి లేటెస్ట్ వెర్ష‌న్ రెడీ చేసుకోవాలి. మ‌న డైరెక్ట‌ర్లు ఫోన్లు కొత్త వెర్ష‌న్ వాడుతారు కానీ, క‌థ‌లు మాత్రం old version తీస్తారు. ఒక‌ప్పుడు పెట్రోమాక్స్ లైట్లు వాడామ‌ని ఇపుడెవ‌రూ వాడ‌రు. ముత‌క వాస‌న కామెడీని ఎంత perfume కొట్టినా జ‌నం భ‌రించ‌లేరు.

అతిశ‌యోక్తుల‌తో కూడిన వ్య‌క్తిత్వం, వింత‌గా ప్ర‌వ‌ర్తించే మ‌న‌స్త‌త్వం ఇవ‌న్నీ కామెడీ క్రియేట్ చేస్తాయి. ఇది స‌క్సెస్‌ఫుల్ ఫార్ములానే. కానీ దీనికి కూడా ఒక క‌థంటూ వుండాలి. ఆ క్యారెక్ట‌ర్లు రిజిస్ట‌ర్ చేసే సీన్స్ వుండాలి. ఇవేమీ లేకుండా వుంటే అల్లుడు అదుర్స్ ... చ‌లి జ్వ‌రం వ‌స్తుంది చూస్తే.

క‌రోనా పోయింద‌నుకుంటే, దానికి మించిన సినిమాలు మాత్రం వ‌స్తున్నాయి జాగ్ర‌త్త‌!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp