అల - అంత తొందర ఏలా

By Ravindra Siraj Feb. 24, 2020, 12:05 pm IST
అల - అంత తొందర ఏలా

సంక్రాంతికి విడుదలై నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సన్ నెక్స్ట్ యాప్ లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందన్న వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. 50 రోజులకు అతి దగ్గరగా ఉన్న తరుణంలో ఇలా డిజిటల్ రూపంలో వదిలితే ఎలా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఒక రోజు ముందు రిలీజైన సరిలేరు నీకెవ్వరు రాకుండా తమ హీరో సినిమా స్ట్రీమింగ్ కావడం ఏమిటన్నది వాళ్ళ క్వశ్చన్.

అయితే వాళ్ళ వెర్షన్ ఎలా ఉన్నా విడుదలకు ముందు జరిగిన ఒప్పందాల్లో భాగంగా అల వైకుంఠపురములులో 45 రోజులకు స్ట్రీమింగ్ చేసుకోవచ్చని నిర్మాత ఒప్పుకుని ఉంటాడని అంతే తప్ప ఇది కావాలని చేసినది కాదని హారికా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ ఏడాది రెండు నెలలు గడవకుండానే ఆన్ లైన్లో 2020లో వచ్చిన కొత్త సినిమాలు హడావిడి చేస్తున్నాయి. ఎంత మంచివాడవురా, దర్బార్, డిగ్రీ కాలేజీ, 3 మంకీస్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెల జానుతో పాటు మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి
ఇప్పుడు కనక అల వైకుంఠపురములో డిజిటల్ వెర్షన్ ని కనక రిలీజ్ చేస్తే భారీ వ్యూస్ దక్కించుకుని తద్వారా రెవిన్యూ పెంచుకోవాలన్నది సన్ నెక్స్ట్ ప్లాన్ లా కనిపిస్తోంది.

ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తాయి ఊహించడం కూడా కష్టమే అనే రీతిలో ఇండస్ట్రీ హిట్ అయ్యిందీ మూవీ. శాటిలైట్ ఎలాగూ జెమినిలో వస్తుంది కాబట్టి ఆ టైంలో వచ్చే ఆదాయం కూడా భారీగా ఉంటుంది. బన్నీ కెరీర్లోనే అతి పెద్ద హిట్ గా నిలవడం తో పాటు ఓవర్సీస్ లోనూ రచ్చ చేసిన అల వైకుంఠపురములో చిన్ని తెరపై ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో ఇంకో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది. అర్ధ శతదినోత్సవం సెంటర్ల నెంబర్ లోనూ రికార్డు సాధించబోతున్న ఈ మూవీ ఎన్ని కేంద్రాల్లో ఈ ఘనత సాధించబోతోందో ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోనుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్న సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్న అల్లు అర్జున్ ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఓకే చేయాల్సి ఉంది. త్వరలో వాటి వివరాలు తెలియవచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp