ట్రిపుల్ మార్కు దాటేసిన బంటు

By Ravindra Siraj Jan. 21, 2020, 10:55 am IST
ట్రిపుల్ మార్కు దాటేసిన బంటు

బాక్స్ ఆఫీస్ వద్ద అల వైకుంఠపురములో జోరు తగ్గడం లేదు. నిన్నటితో పండగ సెలవులు పూర్తయిపోయి ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి బిజీగా మారిపోయినా బంటుగాడు మాత్రం ఇప్పట్లో తగ్గేది లేదంటున్నాడు. ఇంకా రెండు వారాలు పూర్తి కాకుండానే ఈ సినిమా సగర్వంగా మూడు మిలియన్ల మార్కు దాటేసింది. ఇంకో వారం పది రోజులు స్టడీ రన్ కొనసాగే అవకాశం ఉండటంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు ఖాయమయ్యాయి.

Read Also: సామజవరగమానా - తప్పుని ఒప్పనుట తగునా

ఇప్పటికే సరిలేరు నీకెవ్వరుని పెద్ద మార్జిన్ తో దాటేసిన అల వైకుంఠపురములో కలెక్షన్స్ పరంగా రంగస్తలం, భరత్ అనే నేను, సాహోల సరసన చేరిపోయింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక్క యుఎస్ లోనే సుమారు 18 కోట్ల దాకా వసూలు చేసిన స్టైలిష్ స్టార్ మిగిలిన దేశాల నుంచి మరో నాలుగు కోట్ల దాకా రాబట్టినట్టు తెలుస్తోంది. ఫైనల్ రన్ పూర్తయ్యే లోపు మైండ్ బ్లోయింగ్ ఫిగర్ ఖాయమని అక్కడి బయ్యర్ల మాట.

Read Also: సునీల్ కి అతనే పెద్ద అడ్డు

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటిదాకా ఎంత వసూలు చేసిందన్న దాని మీద యూనిట్ నుంచి క్లారిటీ రావడం లేదు. కేవలం పోస్టర్ రూపంలో 104 కోట్ల షేర్ అని ఇచ్చారు కాని ఏరియాల వారిగా ఎంత వసూలు అయ్యిందనేది అధికారికంగా చెప్పలేదు. చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్నట్టు వినిపిస్తోంది. ఫ్యామిలి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు అయినప్పటికీ మాస్ ప్రేక్షకులు అండగా నిలవడంతో అల వైకుంఠపురములో కొత్త ఫీట్లు సాధిస్తోంది. ఇంకో మూడు రోజుల్లో డిస్కో రాజా వస్తున్నప్పటికీ అది మరీ తీవ్రంగా ప్రభావితం చూపించెంత సీన్ లేకపోవచ్చు. ఇక సరిలేరు నీకెవ్వరు స్లో అయిపోగా ఎంత మంచివాడవురా, దర్బార్ లు త్వరగా ఫైనల్ రన్ కు చేరువలో ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp