ఏప్రిల్ 30 - ట్రయాంగిల్ వార్ కుదిరింది

By iDream Post Mar. 14, 2021, 11:09 am IST
ఏప్రిల్ 30 - ట్రయాంగిల్ వార్ కుదిరింది

లాక్ డౌన్ అయిపోవడం ఏమో కానీ బాక్సాఫీస్ వద్ద తప్పని పరిస్థితుల్లో సినిమాలు పోటీ పడుతూ వసూళ్ల మీద ప్రభావం పడుతుందని తెలిసినా సరే సై అంటే సై అని తలపడుతున్నారు. ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశాక మనకు ఇంకే ఢోకా లేదని నిర్మాతలు నిశ్చింతగా ఉండడానికి లేదు. సడన్ గా ఆ రోజు మేము కూడా వస్తామంటూ ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ ప్రొడ్యూసర్లు కూడా బయలుదేరారు. ఇప్పటికే ఆచార్యకు రాధేకు మధ్య వార్ కన్ఫర్మ్ కాగా తాజాగా మరో రెండు సినిమాలకు ఝలక్ ఇస్తూ అక్షయ్ కుమార్ రంగంలోకి దిగాడు. క్రేజీ మల్టీ స్టారర్ గా రూపొందిన సూర్యవంశీ ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత డేట్ లాక్ చేసుకుంది.

వరల్డ్ వైడ్ ఏప్రిల్ 30కి సూర్యవంశీ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఎక్కువ క్రేజ్ ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా స్క్రీన్లు కూడా భారీగా కేటాయించబోతున్నారు. అయితే ఇక్కడో మనవాళ్ళకో చిక్కు వచ్చి పడింది. అదే రోజు రానా విరాట పర్వం, విశ్వక్ సేన్ పాగల్ ను గతంలోనే షెడ్యూల్ చేశారు. ఇప్పుడు సూర్యవంశీ కూడా వాటికి తోడయ్యింది. ఇక్కడ దీన్ని హిందీ సినిమా కదాని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే దీన్ని సౌత్ లాంగ్వేజెస్ లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ వస్తుంది. మల్టీ ప్లెక్సులు దీన్ని వేసేందుకు ప్రాధాన్యత ఇస్తాయి.

అసలే విరాట పర్వం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగే సీరియస్ సబ్జెక్టు. అందులోనూ తొంభై దశకంలో జరిగిన కథగా చూపిస్తారు. ఇలాంటి ప్రయత్నాలకు సోలో రిలీజ్ దక్కడం చాలా అవసరం. మరోవైపు పాగల్ డిఫరెంట్ గా కనిపిస్తున్న ఓ ప్లే బాయ్ తరహా లవ్ స్టోరీ. మరీ భారీ అంచనాలు లేవు కానీ టాక్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు సూర్యవంశీ చూస్తేనేమో అవుట్ అండ్ అవుట్ మసాలా కమర్షియల్ పోలీస్ యాక్షన్ డ్రామా. ట్రైలర్ గత ఏడాదే అంచనాలు పెంచింది. కాబట్టి ఎంత లేదన్నా ఖచ్చితంగా స్క్రీన్లు పంచుకునే విషయంలో సూర్యవంశీ ఎఫెక్ట్ ఉంటుంది. ఫైనల్ గా కంటెంట్ ఉన్న వాళ్లే గెలుస్తారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp