Akhanda : అఖండ మీద కన్నేసిన బాలీవుడ్.. రంగంలోకి నిర్మాతలు?

By Balu Chaganti Dec. 06, 2021, 01:57 pm IST
Akhanda : అఖండ మీద కన్నేసిన బాలీవుడ్.. రంగంలోకి నిర్మాతలు?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన మూడో సినిమా అఖండ సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుంది. విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు నిలబడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మాత్రమే కాక ఇండియా గా మారుతుందన్న అంచనాలు కనపడుతున్నాయి. అయితే మామూలుగానే సౌత్ లో ఏదైనా సినిమా సూపర్ హిట్ అనగానే దానిమీద కన్నసే బాలీవుడ్ అఖండ మీద కూడా కన్నేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మేకర్స్ కి కథలు దొరకడం లేదో ఏమో తెలియదు కానీ సౌత్ లో ఏ సినిమా హిట్ అయినా సరే ముందు దాని మీద ఖర్చీఫ్ వేసేస్తున్నారు.

అందులో భాగంగానే తెలుగు, తమిళ భాషల్లో నుంచి అనేక సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఆఖరికి కొత్త టీమ్ తో తెరకెక్కి సూపర్ హిట్ అయిన ఆర్ఎక్స్ 100 సినిమా ని కూడా అక్కడ రిలీజ్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించుకుంటున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అఖండ సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ లభిస్తోంది. తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి సిటీలో ఈ సినిమా రిలీజ్ అవగా, మొదటి నాలుగు రోజులు అద్భుతమైన రెస్పాన్స్ సాధించింది. అందులో భాగంగానే బాలీవుడ్ కి చెందిన సాజిద్ నడియావాలా లాంటి నిర్మాతలు ఇప్పటికే రైట్స్ కోసం ఆరా తీయడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 100% మాస్ మసాలా కంటెంట్ ఉండటమేగాక హిందూయిజాన్ని, ఎలివేట్ చేసిన ఎలిమెంట్స్ బాగా కలిసి వస్తాయని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.

బీజేపీ కూడా ఒక రకంగా సినిమాను సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఇది తమకు మరింత కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు అయితే బీజేపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అన్షుల్ సక్సేనా నలాంటి వాళ్ళు బహిరంగంగా సినిమాను సపోర్ట్ చేయడమే కాక తెలుగు నుంచి ఇతర భాషల్లోకి డబ్ చేస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ దాని కంటే ముందే బాలీవుడ్ మేకర్స్ మేల్కొని ఈ సినిమా చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి వారు అయితే సినిమాకి కరెక్ట్ గా సూట్ అవుతారని భావిస్తున్నారట. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

Also Read : Akhanda : బాలయ్య నాన్ స్టాప్ వసూళ్ల ప్రభంజనం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp