చిరుని డబుల్ మార్జిన్ తో దాటేసిన బాలయ్య

By iDream Post Apr. 25, 2021, 01:00 pm IST
చిరుని డబుల్ మార్జిన్ తో దాటేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమా అఖండ టీజర్ తో యూట్యూబ్ లో మాములు రచ్చ చేయడం లేదు. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే 40 మిలియన్ల వ్యూస్ దాటేసి హాఫ్ సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. ఆచార్య కేవలం 19 మిలియన్లకే పరిమితం కావడం గమనార్హం. సబ్ స్క్రైబర్స్ తక్కువగా ఉండే ద్వారకా క్రియేషన్స్ ఛానల్ లో ఇన్నేసి వ్యూస్ రావడం పట్ల అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. ఇది మార్కెటింగ్ గేమ్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో యూట్యూబ్ నిబంధనలు మారిపోయాయి. అంత ఈజీగా మ్యానిప్యులేట్ చేయలేరు. ఈ లెక్కన చూసుకుంటే ఇదంతా అఖండకు దక్కిన జెన్యూన్ రెస్పాన్స్ అనుకోవచ్చు.

ఈ స్థాయిలో స్పందన దక్కించుకోవడానికి కారణాలు ఉన్నాయి. బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టి ఏళ్ళు అవుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్, రూలర్లు ఆడకపోయినా పర్లేదు కానీ మార్కెట్ ని ఇమేజ్ ని తగ్గించేశాయి. ఆ డ్యామేజ్ పూడ్చాలంటే బోయపాటి శీను లాంటి దర్శకుడైతేనే తమ హీరోని సరిగ్గా చూపగలడనే ఫ్యాన్స్ నమ్మకం నిలబడేలా టీజర్ కనిపించింది. అందులోనూ ఎన్నడూ చూడని అవతారంలో బాలయ్య కనిపించడం, నంది పంది లాంటి ప్రాస మాస్ డైలాగులు ఎలివేషన్ల స్థాయిని పెంచాయి. దానికి తగ్గట్టే బిజినెస్ ఎంక్వయిరీలు ఒక్కసారిగా ఊపందుకున్నట్టు సమాచారం.

గతంలో ప్రకటించిన మే 28 విడుదలకు ప్రస్తుతానికి అఖండ కట్టుబడినట్టు కనిపిస్తోంది కానీ ప్రాక్టికల్ గా చూస్తే అది నిజమయ్యే అవకాశాలు తగ్గుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఎక్కడ దాకా ఉంటుందో అంతు చిక్కడం లేదు. పెద్ద సినిమాల నిర్మాతలు సగం సీట్లు, తగ్గించిన షోలతో రిస్క్ చేసేందుకు ఎంత మాత్రం సిద్ధంగా లేరు. అఖండకు టీజర్ వచ్చాక ఓ ఓటిటి సంస్థ సుమారు 60 కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చినా ప్రొడ్యూసర్ తిరస్కరించినట్టు ఫిలిం నగర్ టాక్. గత ఏడాది వచ్చిన అఖండ ఫస్ట్ టీజర్ 15 మిలియన్ల వ్యూస్ మాత్రమే రావడాన్ని బట్టి చూస్తే ఇప్పటి గెటప్ ఎంత వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు

Teaser Link @ https://bit.ly/2PWm9TO

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp