డేట్ లాక్ చేసుకోబోతున్న బాలయ్య ?

By iDream Post Jun. 24, 2021, 04:27 pm IST
డేట్ లాక్ చేసుకోబోతున్న బాలయ్య ?

థియేటర్లు తెరుచుకుని వారం రోజులు గడుస్తున్నా నిర్మాతల నుంచి రిలీజ్ డేట్లకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు రావడం లేదు. చూద్దాంలే ఇంకా టైం ఉంది అనే ధోరణితో పాటు థర్డ్ వేవ్ గురించిన ప్రచారం వల్ల ఎందుకొచ్చిన టెన్షన్ లెమ్మని సైలెంట్ గా ఉంటున్నారు. మరోవైపు షూటింగులు మాత్రం వేగమందుకున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో అంతు చిక్కడం లేదు కాబట్టి వీలైనంత స్పీడ్ గా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా చివరి దశలో ఉన్న సినిమా షూట్లు జూలై చివరి లోగా పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఎలాగూ లాక్ డౌన్ లేదు. సో డే అండ్ నైట్ షిఫ్టులకు సైతం యూనిట్లు సై అంటున్నాయి.

ఇక బాలకృష్ణ బోయపాటి శీను కాంబోలో రూపొందుతున్న అఖండకు ప్రాథమికంగా ఒక రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. సెప్టెంబర్ 10న వినాయక చవితి పండగ సందర్భంగా వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే సరిగ్గా ఒక్క రోజు ముందు కెజిఎఫ్ 2 ని షెడ్యూల్ చేయబోతున్నట్టు నిన్ననే బెంగుళూరు న్యూస్ వచ్చింది. ఇంకా అఫీషియల్ కాలేదు కానీ అంతర్గతంగా బయ్యర్ల మధ్య దీని గురించే చర్చ జరుగుతోంది. మరి దాంతో పోటీ అంటే కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో అఖండ మీద ఎంతలేదన్నా ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఇదంతా విశ్లేషించుకున్నారో లేదో తెలియదు

జూలై ఆగస్ట్ రెండు నెలలు పాన్ ఇండియా సినిమాలు ఏవీ రావడం లేదు. వచ్చే అవకాశం ఉన్నవి లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్ లాంటివి మాత్రమే. ఒకవేళ సెప్టెంబర్ కంతా థర్డ్ వేవ్ కరోనా రాకుండా అంతా సాధారణంగా ఉంటే మాత్రం మునుపటిలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు చూడొచ్చు. ఏదైనా తేడా జరిగి కేసులు పెరిగాయా అంతే సంగతులు. మీడియం రేంజ్ చిత్రాలన్నీ ఓటిటి బాట పట్టక తప్పదు. అసలు మున్ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఏ మాత్రం అంతు చిక్కడం లేదు. అఖండ మాత్రం జూలై చివరి లోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా బోయపాటి శీను టీమ్ కష్టపడుతోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp