'పుష్ప'లో అడవి రాముడు ట్విస్ట్ ?

By iDream Post Apr. 21, 2020, 03:36 pm IST
'పుష్ప'లో అడవి రాముడు ట్విస్ట్ ?

ఇప్పుడు స్టార్లందరూ ఇళ్లకే పరిమితమైన సమయంలో కొత్త సినిమాల విశేషాలు లేక మూవీ లవర్స్ అల్లాడిపోతున్నారు. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో టీవీ లేదా స్మార్ట్ ఫోన్స్ లోనే వినోదాన్ని వెతుక్కుంటున్నారు. అయితే క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన లీక్స్ మాత్రం ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రూపొందబోయే పుష్ప గురించి అలాంటి టాక్ ఒకటి బయటికి వచ్చింది.

దాని ప్రకారం ఇందులో బన్నీ క్యారెక్టర్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గానే కాకుండా ఫారెస్ట్ ఆఫీసర్ గా మరొక షేడ్ లో కూడా ఉంటుందట. ఇది డ్యూయల్ రోలా లేక ఒకే పాత్రను సుక్కు అలా డిజైన్ చేశాడా అనే క్లారిటీ లేదు. అల వైకుంఠపురములో వస్తున్న మూవీగా పుష్ప మీద అంచనాలు మాములుగా లేవు అందుకే స్క్రిప్ట్ విషయంలో గట్టిగానే జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ అడవిరాముడుకు పుష్పకున్న కనెక్షన్ విషయానికి వస్తే అందులో కూడా హీరో పాత్ర ముందు అండర్ డాగ్ తరహాలో అడవిలో ఉంటూ అందరి నమ్మకాన్ని పొందుతుంది.

ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో తను ఫారెస్ట్ ఆఫీసర్ అన్ని రివీల్ చేస్తారు. అయితే అందులో ఎన్టీఆర్ రోల్ దొంగ కాదు. పుష్పలో ఈ మార్పు ఉంటుంది. ఇదంతా నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు కాని వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఇలా అడవి రాముడుతో లింక్ కుదురుతోంది. రష్మిక మందన్న హీరొయిన్ గా నటిస్తున్న పుష్ప నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడనే న్యూస్ ఉంది కాని యూనిట్ అధికారికంగా ధృవీకరించలేదు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న పుష్ప వచ్చే ఏడాది ఎప్పుడు విడుదలవుదన్నది కరోనా పూర్తిగా సద్దుమణిగి షూటింగులకు ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తుందనే దాన్ని బట్టి ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp