మెగా మూవీ ప్లానింగ్ మారిపోయింది

By iDream Post Oct. 10, 2021, 12:30 pm IST
మెగా మూవీ ప్లానింగ్ మారిపోయింది

గత పది రోజులుగా మెగాభిమానులను విపరీత ఉత్కంఠకు గురి చేసిన ఆచార్య విడుదల వ్యవహారం తేల్చేశారు. డిసెంబర్ జనవరి కాకుండా ఏకంగా 2022 ఫిబ్రవరి 4కి పోస్ట్ పోన్ చేసి గట్టి షాకే ఇచ్చారు. నిజానికిది ఊహించని డేట్. పుష్పతో క్లాష్ అవుతుందని ప్రచారం జరిగి చిరు బన్నీ ఫ్యాన్స్ ఒకరికొకరు అర్థం లేని ట్విట్టర్ యుద్ధం చేసుకుంటున్న తరుణంలో క్లారిటీ ఇవ్వడం మంచిదే కానీ దీపావళి నుంచి డిసెంబర్ దాకా ఎక్కడా రిలీజ్ చేయాలని అనుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. చిరంజీవి రామ్ చరణ్ ఫుల్ లెన్త్ కాంబోలో రూపొందుతున్న మొదటి సినిమాగా దీని మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది.

ఇలా ఫిబ్రవరికి షిఫ్ట్ కావడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆచార్యకు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి. మరీ ఎక్కువ టైం అక్కర్లేదు కానీ థియేటర్ల విషయంలో ఏర్పడ్డ అనిశ్చితి ఇంకో రెండు నెలలు కొనసాగే సూచనలు ఉన్నాయి కాబట్టి రిస్క్ చేసేందుకు కొణిదెల టీమ్ సిద్ధంగా లేదు. మరొకటి ఆచార్య ఒకవేళ డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో వస్తే అటుపై ఆర్ఆర్ఆర్ కు చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. చిరు సినిమా టాక్ ఎలా ఉన్నా హైప్ దృష్ట్యా థియేటర్లన్నీ ఆర్ఆర్ఆర్ ని వేసుకుంటాయి. అదే జరిగితే బ్లాక్ బస్టర్ అయినా ఆచార్యకు ఫలితం దక్కదు.

ఇక పుష్ప మేకర్స్ డిసెంబర్ 17ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోమని ముందే చెప్పారట. సో మేనల్లుడి మీద చిరు నేరుగా పోటీకి దిగరు కాబట్టి క్లాష్ తప్పింది. మొత్తానికి కేవలం నెల రోజుల కంటే తక్కువ గ్యాప్ లో రామ్ చరణ్ రెండు సినిమాలు ఆర్ఆర్ఆర్, ఆచార్యలు రిలీజ్ కావడం కెరీర్ లోనే మొదటిసారి. స్టార్ హీరోకు గత కొన్నేళ్లలో ఇలా ఎవరికీ జరగలేదు. ఆ టైంకంతా ఆర్ఆర్ఆర్ నెమ్మదించి ఉంటుంది కాబట్టి ఆచార్య ఓపెనింగ్స్ విషయంలో ధీమాగా ఉండొచ్చు. మార్చి, ఏప్రిల్ లో ఎలాగూ సర్కారు వారి పాట లాంటి భారీ చిత్రాలు ప్లాన్ చేసుకున్నాయి కాబట్టి ఆచార్యకు ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదు. రెండో ఆడియో సింగల్ త్వరలో రాబోతోంది

Also Read : నిన్న కవ్వింతలు ఇవాళ కౌగిలింతలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp