ఆచార్య భీమ్లా ఎక్స్ చేంజ్ ఆఫర్ ?

By iDream Post Aug. 19, 2021, 12:10 pm IST
ఆచార్య భీమ్లా ఎక్స్ చేంజ్ ఆఫర్ ?

భారీ సినిమాల రిలీజుల విషయంలో నిర్మాతలు పడుతున్న తంటాలు అన్నీ ఇన్ని కావు. వాటిని పూర్తి చేయడం ఏమో కానీ సరైన విడుదల తేదీని సెట్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారింది. దీని వల్ల ప్రకటించిన డేట్లలో కూడా మార్పులు తప్పేలా లేవు. ఇప్పుడు ఆచార్యకు అలాంటి సమస్యే వచ్చి పడింది. రెండు పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉన్న ఈ చిత్రాన్ని ముందు అక్టోబర్ లో ప్లాన్ చేద్దామనుకున్నారు. కానీ పరిస్థితులు అప్పటికి ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. నవంబర్ డిసెంబర్ లు అంత సేఫ్ సీజన్ కాదు. ఇక నెక్స్ట్ వచ్చే ఆప్షన్ సంక్రాంతి మాత్రమే. కానీ ఆల్రెడీ ముగ్గురు స్టార్ హీరోలు కర్చీఫ్ లు వేసుకుని సిద్ధంగా ఉన్నారు.

అందులో భీమ్లా నాయక్ కూడా ఉంది. 12 అని ముందే చెప్పేశారు. కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఆ తేదీకి ఆచార్యను తీసుకొచ్చి పవన్ సినిమాని జనవరి 22 లేదా 26కి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మెగా కాంపౌండ్ లో జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. దీని గురించి అప్పుడే సోషల్ మీడియాలో మీమ్స్ కూడా మొదలైపోయాయి. భీమ్లా నాయక్ వాయిదా పడొచ్చని తెలియడం ఆలస్యం పవన్ ఫ్యాన్స్ పోస్టులు ట్వీటులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఏకంగా చిరంజీవిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీని గురించి ఇప్పుడు చిరు పవన్ అభిమానులు కొందరు రెండు చీలిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి

ఇలా ఆలోచించడానికి కారణం లేకపోలేదు. ఆచార్య సైతం వంద కోట్ల బిజినెస్ టార్గెట్ తో బరిలో దిగుతోంది. దాన్ని మీట్ అవ్వాలంటే కర్ణాటక, కేరళతో సహా అన్ని చోట్ల థియేటర్లు తెరుచుకుని ఉండాలి. హిందీ డబ్బింగ్ కూడా ఒకేసారి వదిలే ఆలోచనలో ఉన్నారు. అంటే నార్త్ లో కూడా హాళ్లు తెరవాలి. ఇదంతా అక్టోబర్ కంతా జరిగే ఛాన్స్ తక్కువగా ఉంది. అందుకే సేఫ్ గేమ్ కోసం సంక్రాంతికి వెళ్లడం గురించే ఆచార్య టీమ్ ఆలోచిస్తోందట. వకీల్ సాబ్ తరహాలో భీమ్లా నాయక్ కూడా సోలోగా వస్తేనే రెవిన్యూ ఇంకా ఎక్కువ వస్తుందనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయట. ఆగస్ట్ 22న ఇదంతా నిజమా కదా తేలిపోనుంది. చూద్దాం

Also Read : ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఓటిటి తప్పు కాదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp