దూసుకొస్తున్న నెట్ ఫ్లిక్స్ భారీ విడుదలలు

By iDream Post Mar. 04, 2021, 12:45 pm IST
దూసుకొస్తున్న నెట్ ఫ్లిక్స్  భారీ విడుదలలు

థియేటర్లు తెరుచుకున్నాయి కదా ఇక ఓటిటిలకు గడ్డు కాలమే అనుకుంటున్న వాళ్ళ భ్రమలకు తెరదించుతూ డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నిన్న ఇండియాలో విడుదల చేయబోతున్న భారీ ప్రోజెక్టులను ప్రకటన రూపంలో అనౌన్స్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది. ఇందులో స్టార్లు నటించిన సరికొత్త సినిమాలతో పాటు క్రేజ్ ఉన్న వెబ్ సిరీస్ ల కొత్త సీజన్లు, ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్స్ తో రూపొందించిన డాక్యుమెంటరీలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వీటి గురించి పెద్ద చర్చే జరుగుతోంది. స్ట్రీమింగ్ సంస్థలో అత్యంత ఖరీదైన సబ్స్క్రిప్షన్ గా పేరున్న నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకుడు కట్టే డబ్బుకు తగ్గ వినోదాన్ని ఇచ్చేందుకు గట్టి ప్లానే వేస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే మొత్తం ఈ విభాగంలో 13 చిత్రాలు రాబోతున్నాయి. ధనుష్ నటించిన 'జగమే తంత్రం' సౌత్ ఆడియన్స్ దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తోంది. అజీబ్ దాస్తాన్స్, బుల్బుల్ తరంగ్, ధమాకా లు తర్వాత వరసలో ఉన్నాయి. తాప్సీ నటించిన 'హసీనా దిల్ రుబా' మీద ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. జాదూగర్, మీనాక్షి సుందరేశ్వర్, మైల్ స్టోన్ లు క్యూలో నిలుచున్నాయి. అరవింద్ స్వామి-సిద్దార్థ్-రేవతి-విజయ్ సేతుపతి లాంటి భారీ తారాగణం నటించిన అంథాలజీ 'నవరస' కూడా ఇదే ఏడాది రాబోతోంది. మణిరత్నం పర్యవేక్షణలో తొమ్మిది దర్శకులు దీనికి పని చేశారు. డేట్స్ ఇంకా ఇవ్వలేదు.

నెక్స్ట్ థ్రిల్లర్ స్టార్ డైరెక్టర్స్ అబ్బాస్ మస్తాన్ రూపొందించిన 'పెంట్ హౌస్' కూడా వచ్చేస్తోంది. ఇందులో బాబీ డియోల్, అర్జున్ రామ్ పాల్ లాంటి స్టార్లు ఉన్నారు. పగ్గాలైట్, సర్దార్ కా గ్రాండ్ సన్, ది డిసైఫుల్ కూడా వరసలో ఉన్నాయి. వీటిలో దేనికీ తేదీలు ఇవ్వలేదు కానీ 2021 క్యాలెండర్ కు సరిపడా కంటెంట్ అయితే సిద్ధంగా ఉంచుకున్నారు. ఇందులో ఉప్పెన చేర్చకపోవడం గమనార్హం. ఇవి కాకుండా వెబ్ సిరీస్ లు ఢిల్లీ క్రైమ్ 2, అరణ్యక్, బాంబే బేగమ్స్, డీకపుల్డ్, ఫీల్స్ లైక్ ఇష్క్, ఫైండింగ్ అనామిక, జంతారా 2, కోటా ఫ్యాక్టరీ 2, మయి, మసబ మసబ 2, మిస్ మ్యాచ్డ్ 2, రే, షీ 2, ఏ కాలీ కాలీ ఆంకే అన్నీ కంటెంట్ లవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ ఎలాంటి ప్రకటనలతో వస్తుందో చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp