ఒకే రోజు 10 సినిమాల యుద్ధం

By Ravindra Siraj Feb. 20, 2020, 11:06 am IST
ఒకే రోజు 10 సినిమాల యుద్ధం

గత వారం వరల్డ్ ఫేమస్ లవర్ తీవ్రంగా నిరాశపరిచాక ఇప్పుడు అందరి కళ్ళు భీష్మ పైనే ఉన్నాయి. నితిన్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం. చెప్పుకోదగ్గ సమానమైన పోటీ లేదు కానీ భీష్మకు కాంపిటీషన్ గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు అన్ని కలిపి పది దాకా ఉండటం గమనార్హం. లక్ష్ చదలవాడ హీరోగా వాళ్ళ స్వంత బ్యానర్ లో రూపొందిన 'వలయం' క్రైమ్ థ్రిల్లర్ గా వస్తోంది. రమేష్ కడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలేమి లేవు కానీ ప్రమోషన్ కాస్త గట్టిగానే చేస్తున్నారు.

ఇక ఎన్ఆర్ఐ మోజులో పడే యువతను ఉద్దేశించి తీసిన 'ప్రెజర్ కుక్కర్' రేపే వస్తోంది. సుజోయ్, సుశీల్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ కూల్ ఎంటర్ టైన్మెంట్ తో యూత్ ని టార్గెట్ చేస్తోంది. పెళ్లి చూపులు తరహా ఫలితాన్ని ట్రేడ్ ఆశిస్తోంది. సాయి రోనక్, ప్రీతీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రాహుల్ రామకృష్ణ లాంటి తెలిసిన మొహాలు ఉండటం ప్లస్ పాయింట్. ఇక అమిత్, ఇందు అనే కొత్త జంట నటించిన 'చీమా ప్రేమ మధ్యలో భామ' కూడా రేస్ లో ఉంది . దీనికి మినిమం హైప్ లేదు కాని నిర్మాతల కాన్ఫిడెన్స్ ఏంటో రేపు తెలుస్తుంది

నయనతార డబ్బింగ్ సినిమా 'వసంత కాలం' కూడా రేస్ లో ఉంది. ఎప్పుడో పూర్తైపోయి విడుదల ఆలస్యం జరిగిన ఈ సినిమా తమిళ్ లో కొన్ని నెలల క్రితం విడుదలై ఆశించిన ఫలితం అందుకోలేదు. కేవలం నయన్ క్రేజ్ మీద దీన్ని మార్కెట్ చేస్తున్నారు. ఇక హింది విషయానికి వస్తే విక్కి కౌశల్ "భూత్-ది హంటెడ్ షిప్", ఆయుష్మాన్ ఖురానా "శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్" మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ది హండ్రెడ్ బగ్స్ అనే మరో మూవీ కూడా బరిలో దిగుతోంది. ఇవి కాకుండా ది కాల్ అఫ్ ది వైల్డ్, ది ఫేర్వెల్, ది బాయ్ 2 పేజ్ 3 హాలీవుడ్ నుంచి దిగుమతవుతున్నాయి. మొత్తానికి భీష్మతో కలిపి మొత్తం మూడు బాషల్లోనూ 10 కొత్త సినిమాలు రేపు దండయాత్ర చేయనుండటం విశేషం. ఒక్క తెలుగునే తీసుకున్నా ఐదింటి మధ్య పోటీ ఉంటోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp