నాటా కుటుంబ సంబరాలు @ చార్లెట్ ,నార్త్ కరోలినా

By Siva Racharla Feb. 11, 2020, 07:33 am IST
నాటా కుటుంబ సంబరాలు @ చార్లెట్ ,నార్త్ కరోలినా

నాటా చార్లెట్ బృదం వరు చేపట్టిన "నాటా కుటుంబ సంబరాలు " ఫిబ్రవరీ 8 న ప్రశంసనీయం గా చేపట్టారు. పిల్లల భవిష్యత్తుకి తోడ్పడేట్టుగా , వారిని ఉద్దేశించి, వారికి ప్రోత్సాహం అందించే దిశ గా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగినది. నాటా ప్రెసిడెంటు ఎలెక్టు , శ్రిధర్ కొరసపాటి గారు ముఖ్య అథిథి గా విచ్చేసి సభని ఉద్దేశించి , నాటా వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలని వివరముగా చెప్పడం జరిగింది. నాటా బోర్డ్ ఆఫ్ డయిరెక్టరు , రాధకృష్ణ కలువాయి , మే నెలలో జరిగే నాటా సింగింగ్ అయిడల్( NATA singing Idol) మరియు జూన్ లో జరిగబోయే నాటా కన్వెన్షన్ (NATA Convention ) గురించి వివరాలు తెలిపారు.

ఎలిమెంటరీ విధ్యార్ధులు పుబ్లిక్ స్పీకింగ్ కాంపిటిషను లొ చూపించిన ఉత్సాహం , కార్యక్రమానికి విచ్చేసిన తలిదండ్రుల ని , వీక్షకులని సైతం అబ్బుర పరిచినది. ఇక Middle School మరియు High School విధ్యార్ధుల ఉన్నత అలోచనలతో కూడిన సయిన్సు (విఙ్ఞాన) పరికరాలని అందరిని ఆశ్చర్య చకితులని చేసినది. జడ్జీలు గా విచ్చేసిన మిలిండా నికోలస్ మరియు గీతా గిలోరియా ,వారు ఇద్దరు కూడా విద్యా రంగం లో రాణించిన వారవ్వటం తో , విజేతల ఎంపిక న్యాయానుసారం గా జరిగినది.

వర్షం, పలు చోట్ల మంచు పడుతున్నా, లెక్క చేయకుండ విచ్చేసిన వారందరికి నాటా షార్లెట్ బృందం హౄదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నది. దక్షిన్ రెస్టారెంటు వారు ఏర్పరిచిన కమ్మటి విందు భోజనం తో, పిల్లల ఆటపాటలతో, కేరింతలతో ఆ రోజు ముగుసినది. నాటా వారు చేపట్టిన మరొక అద్భుతమైన కార్యక్రమం విజయవంతం గా ముగిసినది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp