వకీల్ సాబ్ వారాంతం ఎంత తెచ్చింది

By BO_tracker Apr. 12, 2021, 05:30 pm IST
వకీల్ సాబ్ వారాంతం ఎంత తెచ్చింది

వకీల్ సాబ్ మొదటి మూడు రోజులు చెడుగుడు ఆడేశాడు. ఫస్ట్ వీకెండ్ ని అంచనాలకు మించిన వసూళ్లతో హోరెత్తించాడు. మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో అనూహ్యమైన పరిస్థితుల వల్ల బెనిఫిట్ షోలు రద్దు కావడం, టికెట్ ధరల రగడ వల్ల ప్రభావం చెందినప్పటికీ అవేవి వకీల్ ప్రభంజనాన్ని తగ్గించలేకపోయాయి. లెక్కల పరంగా కొంత హెచ్చుతగ్గులు ఉన్నాయి కానీ బయ్యర్లు ఏదైతే కోరుకున్నారో ఆ అంచనాలకు అనుగుణంగానే పవన్ సినిమా పెర్ఫార్మ్ చేయడం విశేషం. ముఖ్యంగా రివ్యూలు, పబ్లిక్ టాక్ పాజిటివ్ గా రావడం వకీల్ సాబ్ కు చాలా ప్లస్ అయ్యింది. మహిళలు కూడా థియేటర్లకు రావడం ఓ మంచి పరిణామం.

వారాంతాన్ని వకీల్ సాబ్ సుమారుగా 59 కోట్ల 82 లక్షల షేర్ తో ముగించడం విశేషం. కొన్ని సెంటర్లలో బాహుబలి, అల వైకుంఠపురములో రికార్డులకు దగ్గరగా వెళ్లడం గమనార్హం. ఇది సంక్రాంతి లాంటి హాలిడే సీజన్ కాకపోయినా ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం చూస్తే అది పవన్ స్టామినాగా చెప్పుకోవాలి. పింక్ రీమేక్ ని దర్శకుడు వేణు శ్రీరామ్ హ్యాండిల్ చేసిన తీరు ప్రశంసలు దక్కించుకుంటోంది. ఒకవేళ ఫస్ట్ హాఫ్ ను కూడా బాగా బ్యాలెన్స్ చేసి ఉంటే రేంజ్ ఇంకా పెరిగేది. నైజాంలో వకీల్ సాబ్ అరాచకం మాములుగా లేదు. ఒక్క ఆ ప్రాంతం నుంచే 16 కోట్లకు పైగా రాబట్టడం విశేషం. ఇక ఏరియాల వారీగా ఈ విధంగా వచ్చినట్టు చెబుతున్నారు

- ఏరియా వారీగా వకీల్ సాబ్  మొదటి వారాంతం ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 

ఏరియా షేర్ 
నైజాం 16.30cr
సీడెడ్ 8.15cr
ఉత్తరాంధ్ర 7.70cr
గుంటూరు 5.26cr
క్రిష్ణ 3.25cr
ఈస్ట్ గోదావరి 4.62cr
వెస్ట్ గోదావరి 5.60cr
నెల్లూరు 2.49cr
ఆంధ్ర+తెలంగాణా 53.37cr
రెస్ట్ అఫ్ ఇండియా3.15cr
ఓవర్సీస్3.30cr
ప్రపంచవ్యాప్తంగా59.82cr

లెక్క గట్టిగానే ఉంది కానీ బ్రేక్ ఈవెన్ చేరాలంటే ఇంకో 30 కోట్ల దాకా రాబట్టాలి. రేపు ఉగాది సెలవు రోజు కాబట్టి ఆదివారం స్థాయి రెస్పాన్స్ ఉంటుందని ట్రేడ్ ఆశిస్తోంది. అదే జరిగితే లాభాలకు చేరుకోవడానికి ఇంకా తక్కువ టైం పడుతుంది. ఎలాగూ శుక్రవారం రావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడటం వకీల్ సాబ్ కు ఎంతమేరకు కలిసి వస్తుందో చూడాలి. ఇప్పటికైతే బుకింగ్స్ బాగున్నాయి కానీ మరీ ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పే స్థాయిలో ఇవి కొనసాగుతాయా అనేది వేచి చూడాలి. 90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న వకీల్ సాబ్ కు ఇప్పుడు రాబోయే వారం రోజులు అంటే ఆదివారం దాకా చాలా కీలకంగా మారబోతున్నాయి

Disclaimer: Box Office data is compiled from various sources. We make every effort to verify and give you correct information. However, we do not take any responsibility for authenticity of this data in any manner.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp