[x] close
[x] close

ద‌స‌రా బ‌రిలో బాల‌య్య‌ – ప‌వ‌ర్‌ స్టార్‌.. ?

  • Apr-21-2017 6:45 pm IST
Pawan-Kalyan-and-Balakrishn

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో చాన్నాళ్ల త‌రువాత దిగ్గ‌జ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ త‌మ సినిమాల‌తో కొద‌మ‌ సింహాల్లా త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే.. నిజానికి సంక్రాంతి పోటీలో చిరు, బాల‌య్య ఉంటే ఆ సంద‌డి, క‌ళే వేరని మ‌రోసారి అంద‌రికీ అనుభ‌వంలోకి తెచ్చిన సంద‌ర్భ‌మిది. అంద‌రూ ఆశించిన విధంగానే రెండు చిత్రాలు అంద‌రి మెప్పు పొంది ఘ‌న విజ‌యం సాధించాయి. ఇక ఇప్పుడు మెగాస్టార్ త‌న 151వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉండ‌గా ఇటు బాల‌య్య – పూరీ జ‌గ‌న్నాథ్‌ కాంబినేష‌న్లో సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది.

త‌న సినిమాల‌కు రిలీజ్ డేట్‌ను సినిమా షూటింగ్ మొద‌లుపెట్టే స‌మ‌యంలోనే అనౌన్స్ చేసే ఆన‌వాయితీని కొన‌సాగిస్తూ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ముందే ప్ర‌క‌టించేసిన విష‌య తెలిసిందే.. బాలయ్య – పూరి సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 29న విడుదలకు ముస్తాబవుతోంది. ఇదిలా ఉండ‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ – ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కాంబోలో రూపొందుతున్న‌సినిమాకూడా ఇప్పుడు జెట్ స్పీడులో తెర‌కెక్కుతూ ద‌స‌రా సీజ‌న్లోనే ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మవుతోంది. విశ్రాంతి మాటే మ‌ర‌చిపోయి ఈ చిత్రాన్ని వరుస షెడ్యూల్స్‌తో ఫినిష్ చేసేయాల‌ని, ఎలాగైనా రాబోయే దసరాకు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చెయ్యాలని డిసైడయ్యాడట పవర్ స్టార్. నిజానికి సినిమా చిత్రీక‌ర‌ణ‌కు కాస్త ఎక్కువ స‌మ‌యమే తీసుకుంటాడ‌ని పేరున్న త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉన్న క‌మిట్ మెంట్లను దృష్టిలో ఉంచుకుని, అత‌డి కోరిక మేర‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌లో పూర్తి చేసి ప్రేక్ష‌కుల‌ముందుకు తెచ్చేందుకు ప‌క్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

దీంతో బాలకృష్ణ – పూరి, పవన్ – త్రివిక్రమ్ చిత్రాలు ఒకేరోజు విడుదల కాబోతున్నట్లు సమాచారం. సో.. సంక్రాంతికి చిరుతో తలపడిన బాలయ్య ఈ సారి దసరాకు పవన్ కల్యాణ్‌తో పోటీ ప‌డ‌బోతున్నాడన్న‌మాట. సంక్రాతి సీజ‌న్ మాదిరిగానే ఈ సారి ద‌స‌రా పండుగ‌ కూడా బాక్సాఫీసు వార్‌కు వేదిక కానుంద‌న్న‌మాట‌. అభిమానులూ పారాహుషార్‌..

Comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

%d bloggers like this: