[x] close
[x] close

అలా మ‌ర్చిపోయావేంటి గోపీచంద్..?

  • Jul-17-2017 3:58 pm IST
gopi-chND'

మ‌రుపు మనిషికి కామ‌న్. కొన్నిసార్లు మ‌న‌కు కావాల్సిన వాళ్ల పేర్లే త్వ‌ర‌గా మ‌రిచిపోతుంటాం. ఇప్పుడు గోపీచంద్ కూడా ఇదే చేసాడు. గౌత‌మ్ నందా ఆడియో వేడుక‌లో త‌న‌తో పాటు న‌టించిన హీరోయిన్ల‌లో ఒక‌రి పేరు మ‌రిచిపోయాడు. గౌత‌మ్ నందాలో కేథ‌రిన్, హ‌న్సిక న‌టించారు. కానీ గోపీచంద్ మాత్రం కేథ‌రిన్ పేరు మ‌రిచిపోయాడు.. పుసుక్కున త‌మ‌న్నా అని నోరుజారాడు. సంప‌త్ నంది చేసిన ర‌చ్చ‌, బెంగాల్ టైగ‌ర్ సినిమాల్లో త‌మ‌న్నానే హీరోయిన్. అందుకే ఇప్పుడు కూడా అలాగే అనుకుని నోరుజారాడు గోపీచంద్. కానీ త‌ర్వాత ప‌దిసార్లు సారీ చెప్పాడు. కేథ‌రిన్ చాలా బాగా చేసిందంటూ మెచ్చుకున్నాడు. ఇంకా న‌యం.. గోపీచంద్ త‌న పేరు మ‌రిచిపోయిన‌పుడు కేథ‌రిన్ అక్క‌డ లేదు. ఉండుంటే క‌చ్చితంగా ఫీల్ అయ్యేదేమో పాపం..! ఎంతైనా అప్పుడప్పుడూ అలా మర్చిపోవ‌డం కూడా స‌ర‌దా పుట్టిస్తుంది క‌దా..!

Comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

%d bloggers like this: